కేంద్ర హోం మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. కరోనా బారిన పడిన అమిత్ షా గురుగ్రామ్ లోని ఆసుపత్రిలో ఇటీవల చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇదే విషయాన్ని ఈనెల 14వ తేదీన అమిత్ షా స్వయంగా ట్వీట్ చేశారు.
అయితే గడచిన రెండు, మూడు రోజులుగా అమిత్ షా మళ్లీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. శ్వాసకోశ సమస్యతోపాటు ఒంటినొప్పులు రావడంతో అమిత్ షా ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. గత అర్ధరాత్రి పొద్దుపోయాక రెండు గంటల సమయంలో అమిత్ షా ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరినట్లు జాతీయ మీడియా నివేదించింది.
కాగా అమిత్ షా చేరికకు సంబంధించి ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన ప్రకటనను దిగువన చూడవచ్చు.