భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఈ ఉదయం 11 గంటల సమయంలో గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చేరినట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ ప్రకటించారు. మూడో ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి ప్రవహిస్తుండడం గమనార్హం. దీంతో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీటి ప్రవాహం వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం మరింత పెరిగే అవకాశమున్నట్లు కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రకటించింది. ఇదే సమంయలో 1986 ప్రాంతంలో భద్రాచలాన్ని ముంచెత్తిన వరద నీటికి సంబంధించిన అరుదైన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని ఇక్కడ మీరూ చూడవచ్చు.
ఫీచర్డ్ ఇమేజ్: భద్రాచలంలో 2005 నాటి గోదావరి వరద దృశ్యం