సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి మృతి తెలంగాణ రాష్ట్రానికి, టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు చెప్పారు. రామ లింగారెడ్డి మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలోనేగాక, ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ముందు జర్నలిస్టుగా ప్రజల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన పోరాటం మరువలేనిదని నామా అన్నారు. రామలింగా రెడ్డిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు.
ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసం రామలింగారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని, తెలంగాణ రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా కూడా ఆయన విశేష సేవలు అందించిన గొప్ప నాయకుడిగా నామా నాగేశ్వరరావు గుర్తు చేశారు. రామలింగారెడ్డి కుటుంబానికి ఈ సందర్భంగా తన ప్రగాఢ సంతాపాన్ని, సానూభూతిని వ్యక్తం చేశారు.