కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుటుంబంలో పలువురు కరోనా బారిన పడ్డారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకేగాక వంట మనిషికి, పీఏకు కూడా కరోనా సోకింది. ఈమేరకు ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్రరావు తన సోషల్ మీడియా ఖాతాలో స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారని కూడా రాఘవ చెప్పారు. వనమా రాఘవ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా చేసిన పోస్టులో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను దిగువన చదవవచ్చు.
కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు, వనమా అభిమానులకు విన్నపము. ?
గత కొద్ది రోజుల క్రితం మా కుటుంబ సభ్యులకు కోవిడ్ పరీక్షలు చేయించగా మా అమ్మ గారికి,
వంటమనిషికి , PAకి CORONA POSITIVE వచ్చింది…
నాకు మరియు నాన్న గారికి NEGITIVE వచ్చింది… వైద్యుల సలహాతో వైద్యం చేయిస్తున్నాము. మా అమ్మ గారికి ఎటువంటి సమస్య లేదు.
తరువాత వైద్యుల సలహా మేరకు 26/07/2020 న రెండవసారి పరీక్షలు చెయ్యగా నాకు, నాన్న గారికి negitive report వచ్చింది..
నా భార్య మరియు నా చిన్న కుమార్తెకు corona positive గా వచ్చింది..
వారిని వైద్యానికి తీసుకువెళ్లిగా hospital లో join చేయుట అవసరం లేదు.. HOME QUARANTINE లో ఉంటే సరిపడుతుందని చెప్పినారు .
వైద్యుల సలహా మేరకు 3వ పర్యాయం 29/07/2020 న Covid పరీక్షలు చెయ్యగా, ఈ రోజు 31/07/2020 సాయంత్రం నాకు positiveగా వచ్చింది. నేను HOME QUARANTINE లో ఉంటున్నాను. కావున ప్రజలు,అభిమానులు, కార్యకర్తలకు అందరికి నేను ఎల్లవేళలా phoneలో అందుబాటులో ఉండగలను…
గౌరవ MLA గారు పూర్తి ఆరోగ్యంతో HYDERABAD MLA QUARTERS లో HOME QUARANTINE లో వున్నారు….
మీ వనమా రాఘవేంద్రరావు