ఆ మధ్య అల్లుడి కోసం 67 రకాల వంటకాలను తయారు చేసిన ఆంధ్రా అత్తగారి వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే కదా? అల్లుడికే కాదు కోడలికీ ఈ తరహా మర్యాద చేయాల్సిందే అంటున్నారు ఈ చెన్నయ్ అత్తగారు. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ అత్తగారి గురించి కూడా తెలుసుకోవలసిందే మరి!
తమిళనాడులోని మధురై జిల్లా మూండ్రుమావడికి చెందిన అబుల్ హాసన్ కు సమీప ప్రాంతంలోని షబ్నాతో జస్ట్ ఓ పదిహేను రోజుల క్రితం పెళ్లి జరిగింది. అయితే నట్టింట్లో అడుగిడిన కొత్తకోడలి కోసం అత్తగారైన వరుడి తల్లి అహిలా 101 రకాల వంట పదార్థాలతో మర్యాద చేసి మరీ ఆహ్వానించారు.
ఈ వంటకాల్లో ఏయే స్పెషల్స్ ఉన్నాయంటే… బిర్యానీ, ఫ్రైడ్ రైస్, చికెన్, మటన్, చేపలు, కోడిగుడ్డు వంటి నాన్ వెజ్ రకాలు మాత్రమే కాదు పులిహోర, పెరుగన్నం, చపాతి, పరోటా, అప్పడం వంటి వెరైటీలు కూడా ఉన్నాయి. అరటి ఆకుల్లో ఆయా ఆహార పదార్థాలను ఉంచి అత్తగారు అహిలి కొత్తకోడలు షబ్నాకు సాదర స్వాగతం పలికారు.
ఈ 101 రకాల వంటల వార్తకు సంబంధించిన వీడియోను దిగువన గల లింకులో మీరూ చూసేయండి.