పరిస్థితులు తిరగబడి ఉన్నఫళంగా ఉద్యోగం కోల్పోతే ఇక జీవితం ముగిసినట్లేనా? మరే ఇతర వనరులు మనిషి జీవనాన్ని ముందుకు నడిపించలేవా? చదివిన చదువుకు, చేస్తున్న పనికి పొంతన లేని పరిస్థితుల్లో నామోషీగా ఫీల్ కావలసిన అవసరం ఉందా? మనిషి బతికేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయంటున్నారు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శారద.
సంపాదనే జీవితం కాదని, లగ్జరీగా బతికితేనే లైఫ్ కాదని కూడా ఆమె నిర్వచించడం విశేషం. ఉద్యోగం పోయినంత మాత్రాన ఆత్మహత్యలు పరిష్కారం కాదని కూడా డిప్రెషన్ కు గురయ్యేవారికి శారద హితవు చెప్పారు. కరోనా కల్లోల పరిణామాల్లో ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శారద రోడ్డు పక్కన కూరగాయాలు విక్రయిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్న తీరుపై ‘సాక్షి’ టీవీ మానవీయ కోణంలో వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. మనిషి జీవన మనుగడపై ఆసక్తికర ఆయా కథనాన్ని దిగువన మీరూ చూసేయండి.