ఎలుగుబంటి… మన వాడుక భాషలో ‘గుడ్డెలుగు’ అంటుంటాం. ఇది ప్రత్యక్షంగా ఎదురైతే ఏం చేస్తాం. ప్రాణభయంతో బిక్కచచ్చిపోతాం. దేవుడా… దేవుడా… అంటూ ప్రార్థిస్తాం. మన గిరిజన గూడేల్లో అటవీ ఉత్పత్తుల కోసం అరణ్యంలోకి వెళ్లిన అనేక మంది ఎలుగుబంటి దాడిలో గాయపడి, చనిపోయిన ఘటనలు కోకొల్లలు.
మెక్సికోలోని చినిక్ ఎకోలాజికల్ పార్కులో ముగ్గురు యువతులు నిల్చున్న ప్రదేశానికి ఓ ఎలుగుబంటి వచ్చింది. వచ్చాక ఎలుగుబంటి ఏం చేసిందీ, మరి వాళ్లేమయ్యారు అంటే…? దిగువన గల ట్విట్టర్ వీడియోను తప్పక చూడాల్సిందే. చూశాక ఆ యువతుల ధైర్యానికి చప్పట్లు కొట్టాల్సిందే మరి!