వరంగల్ మహానగరంలో ఉద్రిక్తత ఏర్పడింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనంపై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొందరు దాడి చేశారని వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ నేతలు ఆరోపించారు. తమ కార్యాలయానికి గెస్టుగా వచ్చిన అర్వింద్ పై కోడిగుడ్లు, రాళ్లు, మారణాయుధాలతో దాడి చేశారని, ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
అయితే వరంగల్ పర్యటనకు వచ్చిన ఎంపీ అర్వింద్ తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని టీఆర్ఎస్ కు చెందిన వరంగల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్ సవాల్ చేశారు. వరంగల్ నగరంలో గజం భూమిని తాము ఆక్రమించినా రాజీనామాకు సిద్దమని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తమ జోలికి వస్తే ఊర్కునే ప్రసక్తే లేదని అన్నారు.
కాగా తనపై జరిగిన ఘటనకు సంబంధించి ఎంపీ అర్వింద్ చేసిన ట్వీట్ ను దిగువన చూడవచ్చు.