వాస్తవానికి ఈ ఫొటోలకు పేరాల కొద్దీ అక్షరాలు అవసరం లేదు. ఈ తిమింగలం ఫొటోలను నిశితంగా చూడండి. విషయం బోధపడుతుంది. మీరు జంతు ప్రేమికులైతే, ఖచ్చితంగా మీ మనసు కకా వికలమవుతుంది. కడుపులో దేవినట్లవుతుంది. దాదాపు 20 టన్నుల మగ తిమింగలం. స్కాట్లాండ్ లోని హారిస్ బీచ్ ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. ఈ భారీ తిమింగలాన్ని తరలించేందుకు సంబంధిత అధికారులు బీచ్ వద్దకు వచ్చారు. కానీ తిమింగలం శరీరం నుంచి తాళ్లు, కప్పులు, గ్లోవ్స్, చేపలు పట్టే వలలు, బ్యాగులు, బాల్స్ తదతర దాదాపు 100 కిలోల ప్లాస్టిక్ వస్తువులు బయటపడ్డాయి. దీంతో తిమింగలాన్ని తరలించే పరిస్థితి లేక అక్కడే పాతిపెట్టారు. పర్యావరణ ప్రేమికులు ఈ పరిణామంపై తీవ్రంగా మండిపడుతున్నారు. మనుషుల మూర్ఖత్వం తిమింగాల ప్రాణం మీదకు కూడా వచ్చిందని ప్లాస్టిక్ ముప్పును తలచుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.