మెడికల్ లీవ్ పై ఇంటికి వచ్చిన ఓ అసిస్టెంట్ కానిస్టేబుల్ ను మావోయిస్టు పార్టీ నక్సలైట్లు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటనలో అతని తల్లిదండ్రులను సైతం నక్సల్స్ గాయపర్చారు.
తెలంగాణా సరిహద్దుల్లో గల ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫార్సిగాడ్ లో పోస్ట్ చేసిన అసిస్టెంట్ కానిస్టేబుల్ సోమర్ పోయం మట్వారా నివాసి. అనారోగ్యం కారణంగా మెడికల్ లీవ్ పై తన స్వగ్రామానికి వచ్చాడు.
ఇదే సమయంలో గత రాత్రి పొద్దుపోయాక సుమారు 12 మంది నక్సలైట్లు అసిస్టెంట్ కానిస్టుబుల్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇనుపతీగలతో దాడి చేసి, ఆరు బాణాలను అతని శరీరంలోకి దించి అత్యంత కర్కశ రీతిలో హత్య చేశారు. అడ్డుకున్నఅతని తల్లిదండ్రులను కూడా నక్సలైట్లు గాయపరిచారని బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ మీడియాకు చెప్పారు.