జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (NMDC) కు చెందిన ఉద్యోగి ఒకరిని మావోయిస్టు పార్టీ నక్సలైట్లు దారుణంగా హత్య చేశారు. ప్రజాకోర్టును ఏర్పాటు చేసి మరీ నక్సల్స్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లా కిరండోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిరోలి గ్రామంలో నక్సలైట్లు ప్రజాకోర్టు ఏర్పాటు చేశారు. ఎన్ఎండీసీలో పనిచేసే మిట్టూరామ్ మార్కమ్ అనే ఉద్యోగిని ఇక్కడి ప్రజాకోర్టులో నక్సల్స్ కాల్చి చంపారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.