‘పోలీసు వ్యవస్థను మార్చాలని చాలా ప్రయత్నించాను. నావల్ల కావడం లేదు. ప్రభుత్వం కూడా నిస్తేజంగానే ఉంది. నేను ప్రభుత్వానికి భారం కాలేను. నాకు కూడా ప్రభుత్వం భారం కాకూడదు. నేను ఇమడలేకపోతున్నాను. నా బాధ్యతల నుంచి నేను తప్పుకుంటున్నాను. వచ్చే అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ జయంతి రోజున నేను పదవీ బాధ్యతల నుంచి వైదొలగుతున్నాను. ప్రి-మెచ్యూర్ రిటైర్మెంటుకు అవకాశం ఇవ్వండి’ అంటూ తెలంగాణా పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. నిర్ణీత గడువుకు ముందే తాను పదవీ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు అవకాశం కల్పించాలని కొద్ది సేపటి క్రితం నోటీసు ఇచ్చారు.
సీనియర్ ఐపీఎస్ వీకే సింగ్ రాసిన ఈ లేఖ తెలంగాణా పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన రాసిన లేఖను దిగువన చూడవచ్చు.