అభయారణ్యాల్లో సంచరించాల్సిన వన్య మృగాలు జనారణ్యంలోకి ప్రవేశిస్తే…? పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది కదూ! ప్రాణాలు అరచేతిలో పట్టుకుని మనుషులు పరుగులంకించుకోక తప్పదు. ఆ మధ్య హైదరాబాద్ నగర శివార్లలోకి ఓ చిరుత ప్రవేశించి నానా యాగీ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. గుజరాత్ జనావాసాల్లోకి కూడా కొద్ది రోజుల క్రితం సింహాలు ప్రవేశించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఓ పెద్దపులి… ఔను పెద్ద పులే… జనావాసాల్లోకి ప్రవేశించి భయానక వాతావరణాన్ని సృష్టించింది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నందా కొద్ది సేపటి క్రితం ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ఓ ఇంటి నుంచి మరో ఇంట్లోకి పులి ఎలా గంతులేస్తోందో దిగువన మీరూ చూసేయండి.