తన కారు డ్రైవర్ కు కరోనా సోకినట్లు జరుగుతున్న ప్రచారంపై లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు స్పష్టత ఇచ్చారు. నామా కారు డ్రైవర్ కు కరోనా సోకినట్లు వైద్యాధికారులు ధృవీకరించారని, దీంతో ఎంపీ నామా స్వీయ హోం క్వారంటైన్లోకి వెళ్లారని ఓ న్యూస్ యాప్ ప్రచురించిన వార్తా కథనం కలకలానికి దారి తీసింది.
ఇదే అంశంపై ఎంపీ నామా నాగేశ్వరరావును ts29.in సంప్రదించగా, ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి తన కారు డ్రైవర్ సొంత పనుల కోసం గత కొన్ని రోజులుగా ఏలూరులో ఉంటున్నారని నామా చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని కూడా నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాగా తాను తన స్వగ్రామంలోనే ఉన్నానని, ఎటువంటి పుకార్లు నమ్మవద్దని నామా డ్రైవర్ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.