కరోనా వైరస్ కు ఔషధాన్ని కనిపెట్టే అంశంలో ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు అనవసరంగా కష్టపడుతున్నట్లున్నారు. ప్రపంచ దేశాలు కూడా కోట్లాది రూపాయలను పరిశోధనలకే తగలేస్తున్నట్లున్నాయ్. కరోనాను ఎదుర్కుంనేందుకు పారసిటమోల్ టాబ్లెట్, బ్లీచింగ్ పౌడర్ వినియోగించాలన్న నేతల వ్యాఖ్యలు పాత చింతకాయ ముచ్చట్లు.
కరోనా కడుపులోకి వెడితే కింద నుంచి బయటకు వెడుతుందనేది ఇటీవల పంచాయత్ రాజ్ మినిష్టర్ ఎర్రెబెల్లి దయాకర్ రావు కొత్తగా చెప్పిన సంగతి. తెలుగు రాష్ట్రాల సీఎంలతోపాటు మంత్రి దయాకర్ రావుకన్నా తానేమీ తీసిపోలేదని మంత్రి మల్లారెడ్డి తన వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెబుతున్నారు.
మేడ్చల్ జిల్లా షామీర్ పేట మండలం తూంకుంటలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా విరుడుగుకు ఆయన చెప్పిన మందు ఏమిటో, అందుకు తీసుకోవలసిన చర్యలేమిటో తెలుసా? కరోనా వైరస్ పారిపోవాలంటే మనం హరితహారం చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఏమైనా డౌటా…? అయితే దిగువన గల వీడియోను చూడండి.