కరోనా సోకిన రోగులకు వైద్యం చేసే డాక్టర్ల శరీర అవయవాల్లో చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించిన ఫొటో ఇది. పీపీఈ కిట్లు, గ్లౌజులు ధరించి రోగులకు వైద్యం చేసిన అనంతరం డాక్టర్లు వాటిని తొలగిస్తే శరీర అవయవాలు ఎలా మారిపోతున్నాయో తెలుసా? ఇదిగో ఇలాగే…! దాదాపు పది గంటలపాటు రక్షణ కిట్లు ధరించి, రోగులకు వైద్య సేవల అనంతరం డాక్టర్ల చేతులు ఇలా మారిపోతున్నాయంటూ ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్లర్లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఫ్రంట్ లైన్ హీరోలకు ‘సెల్యూట్’ చేస్తూ కాప్షన్ కూడా రాశారు. ఆయా ట్వీటును దిగువన మీరూ చూడండి.