‘ఏమి మారెను…? ఏమి మారెను రా…?’ అన్నాడో సినీ కవి. ఆ కవి హృదయానికి నిలువెత్తు సాక్ష్యంగా తాజా ఘటనలను అరుదైన పాత ఫొటోలతో బేరీజు వేసిన చిత్రాలివి. స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్ల బతుకులకు, ప్రస్తుత జీవన విధానం మధ్య మార్పులు వచ్చాయా…? అంటే అబ్బో ఎంత సాంకేతిక? మరెంత ఆధునికత, ఇంకెంత అభివృద్ధి అని చెప్పవచ్చు. తప్పేం లేదు. ఎవరి వాదన వారిదే. భిన్నాభిప్రాయాలు సహజమే. వీటిని వ్యక్తీకరించడం మన దేశంలో సర్వ సాధారణం కూడా.
కానీ… కరోనా కల్లోలం, లాక్ డౌన్, వలస కూలీల తరలింపు అంశాల్లో చోటు చేసుకున్న పరిణామాల తాలూకు ఫొటోలతో, స్వాతంత్య్రం సిద్ధించిన సందర్భంగా జరిగిన ఘటనల బాపతు దృశ్యాలను బేరీజు వేస్తూ ఎవరో అజ్ఞాత వ్యక్తి రూపొందించిన ఆసక్తికర చిత్రాలివి. సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి. దిగువన మీరూ ఓ చూసేయండి.