ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే భార్యకు కూడా కరోనా సోకింది. అధికార పార్టీకి చెందిన ఆయా ఎమ్మెల్యే ఇప్పటికే కరోనా బారిన పడి హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే భార్యకు, కారు డ్రైవర్ కు, గన్ మెన్ కు, వంట మనిషికి కూడా కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్లు తాజా సమాచారం. ఎటువంటి లక్షణాలు లేకుండానే వీరందరికీ టెస్టుల్లో పాజిటివ్ రిజల్ట్ రావడంతో వారందరినీ హోం క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు. భయాందోళనకు గురి కావద్దని, ధైర్యంగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే తప్ప ఆసుపత్రిలో చేరవద్దని, అప్పటి వరకు హోం క్వారంటైన్లోనే ఉండాలని ఫోన్ ద్వారానే వైద్యులు వీరికి సూచించినట్లు తెలిసింది.