నక్సలైట్లకు తుపాకీ బుల్లెట్ల సరఫరా కేసులో ఇద్దరు పోలీసులు అరెస్టయ్యారు. ఛత్తీస్ గఢ్ లోని కొన్ని ప్రాంతాల్లో పోటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు ప్రాచుర్యంలో గల మావోయిస్టు నక్సలైట్లకు భారీ ఎత్తున తుపాకీ తూటాలను సరఫరా చేస్తున్న నలుగురిని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయా ఘటనపై విచారణ జరుపుతున్న క్రమంలో మరి కొందరి పేర్లు కూడా వెలుగులోకి రావచ్చని పోలీసులు అంచనా వేశారు.
ఈ నేపథ్యంలోనే మావోయిస్టు నక్సలైట్లకు తుపాకీ తూటాలను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఏఎస్ఐ ఆనంద్ జాదవ్, హెడ్ కానిస్టేబుల్ సుభాష్ సింగ్ లను సుక్మా పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. నక్సలైట్లకు తూటాలు సరఫరా చేసిన ఘటనతో వీరికి సంబంధం ఉండడం వల్లే అరెస్ట్ చేసినట్లు సుక్మా ఎస్పీ శాలబ్ సిన్హా మాన్లే వెల్లడించారు.