లాక్ డౌన్ సమయలో వన్యప్రాణుల ఆటలు, సయ్యాటలు భలే ఆసక్తికరంగా మారాయి. విశాల అటవీ ప్రపంచంలో స్థలమే లేనట్లు ఓ చిరుత పులి పిల్లలు తమ తల్లి కాళ్లు, ఉదరం మధ్య నుంచి దూరడం, పెద్దపులి సంతానం తల్లి నడుం మీద చేరి ఆడుకోవడం, ఓ కోతిని తన ఆహారంగా మార్చుకునేందుకు చిరుత చెట్టెక్కి చేసిన విన్యాసం, బద్ధ శత్రువులైన పాము, కప్ప భాయి… భాయి చందంగా వ్యవహరించడం…. పాము నడుంపై కప్ప సవారీ చేయడం… బాగున్నాయ్ కదా… సన్నివేశాలు?
ఇవేవీ కల్పితం కాదు. అటవీశాఖ ఉన్నతాధికారి సుశాంత నందా తన ట్విట్లర్ లో పోస్టు చేసిన ఆయా ఘటనల తాలూకు దృశ్యాలను దిగువన చూసేయండి. మనకు తెలియని అటవీ ప్రపంచం, వన్యప్రాణుల ఆటలు, సయ్యాటలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కూడా… చూసి ఆనందించండి.