అవును, బాలసుబ్రమణ్ణెం గొప్పోడే, డౌటెందుకు!
ఇప్పుడు 50-60 ఏళ్లకి మద్దెనున్న పోరీలు, పోరల్లలో 90శాతం మంది సినిమా పిచ్చోళ్లే.
ఆళ్లకు సిన్మా పిచ్చి ఎక్కించిన టాప్-5*లో సుబ్రమణ్ణెం ఒకడు.
సినిమా పిచ్చోళ్లయిన అంకుల్స్, ఆంటీల్లో ఎవర్ని కదిపినా ఫుల్ పేజీ మెటీరియల్ గ్యారంటీగా దొరుకుద్ది.
సుబ్రమణ్ణెం ఎంట్రీ ఇచ్చిన రోజులు మామూలు రోజులు కావు…
– 78rpm graphite గ్రాంఫోన్ రికార్డుల నుంచి 45rpm vinyle రికార్డుల్లోకి ఇండియా మారుతున్న టైము
– డ్రై బ్యాటరీ సింగిల్ బ్యాండ్ రేడియో నుంచి మల్టీ బ్యాటరీ ట్రాన్సిస్టర్లు పెరిగిన రోజులు
– జీడి పాకంలా సాగే పద్యాల నుంచి జనం మెల్లిగా తప్పుకుంటున్న రోజులు
– RD Burman ఊగు అండ్ దొర్లు (rock n roll) మ్యూజిక్కిస్తున్న రోజులు.
– అమ్రికాలో Elvis presley, ఇండియాలో కిశోరుకుమార్ పాటలకు స్పీడెక్కించిన రోజులు
– శ్రోతలు కోరిన పాటల్లో ‘పేరు వినడానికి’ జనం పాకులాడిన రోజులు
– ఎన్టీఆర్, ఏఎన్నార్ తరానికి పోటాపోటీగా కుఱ్ఱోళ్లు దిగుతున్న రోజులు
– బరువు గొంతుల స్థానంలో చలాకీ వాయిస్ కోరుకుంటున్న రోజులు
– అన్నిటికీ మించి మా క్రిష్నగాడు డిష్యూం డిష్యూం అంటున్న రోజులు
– ఓ చిన్నదాన నన్ను ఇడిసి పోతావటే… అనేసి వీజీగా హమ్మింగ్ చేసే రోజులు.
ఇన్ని మార్పుల మధ్యలో ఎంట్రీ ఇచ్చిన బాలసుబ్రమణ్ణేనికి… ‘70కి ముందు పుట్టినోళ్లు ఫుల్ ఫిదా అయ్యారు. 55 ఏళ్లుగా ఆయన సింగింగ్ కెరీరు సాగడంలో వీళ్లదే పెద్ద పాత్ర. కాదా మరి!
‘పాఠం చదవమంటే పాటలింటున్నావా?’ అనేసి ఈ పాడు దేహాన్ని ఎంత శుద్ధి చేశారో తెలుసా!
మమ్మల్ని సినిమా పిచ్చోళ్లను చేసిన Top-5 :
ఎన్టీఆర్, క్రిష్నగాడు, బాలసుబ్రమణ్ణెం, ఆణిస్రీ, సత్యం
✍️ మణిభూషణ్
Image courtesy: Giridhar Arasavalli