పాకిస్థాన్ మిడతల దండు తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లోకి చేరింది. మన శత్రుదేశమైన పాకిస్థాన్ నుంచి తొలుత రాజస్థాన్ రాష్ట్రంలోకి, అక్కడి నుంచి గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రలను చుట్టుముట్టేసినట్లు తాజా వార్తల సారాంశం. పచ్చటి పంటలను ఆనవాళ్లు లేకుండా ఆరగించే ఈ మిడతల దండు తాజా విపత్తుగానే ఇప్పటికే బాధిత రాష్ట్రాలు అంచనా వేస్తున్నాయి. ఓ రెండున్నర వేల మంది భుజించే ఆహారాన్ని చిన్నపాటి మిడతల గుంపు ఓ పూటలో తినేస్తుందట. ఈ ఆహారపు మొత్తం 10 ఏనుగులు, 25 ఒంటెలకు కూడా సరిపోతుందంటే ఆశ్చర్యం కాదట. గాలివేగాన్ని బట్టి సగటున రోజుకు 150 కిలోమీటర్ల వరకు ఈ మిడతలు జర్నీ చేస్తాయట.
అయితే ప్రస్తుతం ఈ పాకిస్థాన్ మిడతల దండు తెలంగాణా సరిహద్దుల్లోకి చేరడమే రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్రలను అనుకుని ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోకి ఇవి ప్రవేశించే అవకాశాలున్నాయని అధికారగణం అంచనా వేస్తోంది. పరిస్థితిని సమీక్షించాలని వ్యవసాయ శాఖ చీఫ్ సెక్రెటరీ బి. జనార్ధన్ రెడ్డి నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. పాకిస్థాన్ మిడతల దండు ప్రభావం అన్ని రకాల పంటలపై తీవ్రంగా ఉంటుందని, కరువు, కాటకాలు వచ్చే ప్రమాదం సైతం ఉందని వార్తలు వస్తున్నాయి.
పాకిస్థాన్ మిడతల దండు తీవ్రత ఎలా ఉంటుందో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోను దిగువన చూసేయండి. ఈ వీడియో రాజస్థాన్ లోని నివాస ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు సోషల్ మీడియా వార్తల కథనం.