అంఫన్ తుపాను కోల్ కతాలోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని గజగజ వణికించింది. తుపాను పరిస్థితిపై రివ్యూ చేస్తున్న సమయంలో తన కార్యాలయం వణికిపోయినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడం గమనార్హం. కోల్ కతా నగరాన్నితీవ్రంగా వణికించిన అంఫన్ తుపాను తీవ్రతకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంఫన్ తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం భారీ ఎత్తున నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తుపాను వల్ల 12 మంది అకాల మృత్యువాత పడ్డట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అంఫన్ తుపాను బీభత్సానికి కోల్ కతా నగరం ఎలా వణికిపోయిందో దిగువన గల రెండు వీడియోలను చూసి అంచనా వేసుకోవచ్చు.