ప్రస్తుతం కోటిన్నర మంది భక్తుల సంఖ్యకు చేరిన మేడారం జాతర ఏడు దశాబ్దాల క్రితం… అంటే 70 ఏళ్ల క్రితం ఎలా ఉండేది? అప్పటి జాతరను కళ్లారా చూసినవాళ్లు ఇప్పుడు వృద్ధ్యాప్యంలో ఉండి ఉంటారు. వాళ్లలో కొందరు ఉన్నా, లేకపోయినా కొన్ని అరుదైన ఫొటోలు మాత్రం అప్పటి దృశ్యాలను కళ్లకు కట్టినట్లు సజీవంగా చూపుతున్నాయి. మేడారం వెళ్లడానికి ఇప్పుడున్న రోడ్లు అప్పుడు లేవు. రవాణా సదుపాయాలు అంతకన్నా లేవు. బస్సుల మాటే లేదు.
కానీ వన దేవతలైన సమ్మక్క-సారలమ్మ తల్లుల దర్శనం కోసం అప్పట్లోనూ భక్తులు మేడారం కీకారణ్యంలోకి తండోపతండాలుగానే వచ్చేవారు. అడవి తల్లులను తనివి తీరా కొలిచేవారు. తమను చల్లగా చూడాలని వేడుకునేవారు. అప్పటి దృశ్యాలకు సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోలు ఇక్కడ చూడవచ్చు. డెబ్బయి ఏళ్ల క్రితం భక్తులు జాతరకు ఎడ్ల బండ్లపై పయనించడం, గుడారాలు నిర్మించుకోవడం, వనదేవతల దర్శనం, శివసత్తుల పూనకం, చెట్ల కింద భోజనాలు, తలనీలాల సమర్పణ, అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కుల చెల్లింపు, జంపన్నవాగులో స్నానాలు, ఆదివాసీల నృత్యాలు తదితర జాతర దృశ్యాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. వాటిని దిగువన స్లైడ్ షోలో తిలకించండి.
Photo courtesy: India Herald