హైదరాబాద్ మహానగరంలో బుధవారం ఉదయం ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. సికిింద్రాబాద్ లోని బోయగూడ ఐడీహెచ్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవ దహనమయ్యారు. ఇద్దరు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగా, మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. బోయగూడలోని ఐడీహెచ్ కాలనీలో గల ఓ తుక్కు (స్క్రాప్) గోదాంలో షార్ట్ సర్య్కూట్ కారణంగా ఈ మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఈ తెల్లవారు జామున 4 గంటలకు జరిగిన ప్రమాదంలో తుక్కు షాపులో 15 మంది ఉన్నారు. బీహార్ కు చెందిన 15 మంది వలస కార్మికులుగా భావిస్తున్న వీరు మంగళవారం రాత్రి నిద్రలో ఉన్న సమయంలోనే షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడినట్లు సమాచారం. ఇందులో ఇద్దరు కార్మికులు ప్రమాదం నుంచి బయటపడగా, 11 మంది సజీవ దహనమయ్యారు. ఇంకో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది.
ఈ సంఘటనలో ఆరుగురు కార్మికుల డెడ్ బాడీలను వెలికి తీశారు. స్క్రాప్ షాపులో కట్టెలతోపాటు మంటలు వేగంగా వ్యాపించే స్వభావం గల ఇతర వస్తువులు అక్కడ ఉండడం వల్లే ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లు భావిస్తున్నారు.