కోతులకు అవాంఛిత రోమాలు పుట్టించడంలో సోషల్ మీడియా యాక్టివిస్టులు కొందరు మహా ముదుర్లు అంటుంటారు గాని, ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్లనే బదిలీ చేసేటంత దిట్టలని మాత్రం తాజా ఘటనలో వెల్లడైంది. ఈ ‘దిట్టలు’ తెలంగాణాలో ఎడాపెడా ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసి పడేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది ఐపీఎస్ అధికారులను ‘అడ్డగోలు’ బదిలీలకు గురి చేశారు. అందుకు సంబంధించిన పోస్టు ఒకటి వాట్సాప్ గ్రూపుల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ముందు దిగువన గల ఆయా బదిలీల పోస్ట్ జాబితాను ఓసారి చూడండి. ఆ తర్వాత అసలు విషయంలోకి వెడదాం.
భారీగా ఐపీఎస్ ల బదిలీలు
కరీంనగర్ సీపీ కమలాసన్ బదిలీ
Avinash Mohanthy – DIG Wgl
Tauriq Iqbal – CCS head
Sunpreet Singh – Sz DCP
Shivdhar Reddy – Hyd CP
Nagi Reddy – RTC MD
Stephen – Rachakonda CP
Chandrashekar reddy- DIG Hyd
Swetha – CP Nizambad
Chandana – SP Sangareddy
AR Srinivas – Joint CP Cyb
Anjani Kumar – CID Chief
Anil Kumar – IG North Zone
Ranganath – DIG Nizambad
Kamal Hasan – SB City
Tarun – Joint CP Rachakonda
Srinivas reddy – SP Kamareddy
Kotireddy – SP Medak
చదవారుగా…? ఇది సోషల్ మీడియా ముదుర్ల పైత్యానికి పరాకాష్టగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందుకు సంబంధించి ఎక్కడా ప్రభుత్వ ఉత్తర్వు వెలువడిన దాఖలాలు లేవు. అనేక మంది ఐపీఎస్ అధికారుల పేర్లను కూడా కనీసం భాషా దోషాలు లేకుండా రాయలేకపోయారు. ఇంతకీ ఈ బదిలీలకు సంబంధించిన వివరాలతో కూడిన పోస్ట్ ఎవరు తయారు చేశారనుకుంటున్నారా? బహుషా కొందరు అధికారులు బదిలీ అయితే బాగుండని భావించే వారి సృష్టి అన్నమాట. ఈ వార్తా కథనం రాసే సమయానికి ఆయా అధికారుల బదిలీలకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు లేవని అధికార వర్గాలు ts29తో స్పష్టం చేయడం గమనార్హం. ఈ బదిలీల ప్రచారంపై పోలీసు వర్గాలు కూడా ఆయా పోస్టు నిజమేనా? అంటూ ఆరా తీయడం విశేషం. మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే తెలంగాణాలో ఇప్పటికైతే బదిలీలు లేవు… గిదిలీలు లేవు. అంతా ‘శోషల్’ మీడియా ముదుర్ల శాడిజమనే విషయం స్పష్టమవుతోంది. అదీ సంగతి.