ఇద్దరు ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం జైలు శిక్ష విధించింది. ఏపీలో 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ గత ఏప్రిల్ లో తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదంటూ హైకోర్టు ఆగ్రహించింది. ఈమేరకు ఐఏఎస్ అధికారులు గిరిజా శంకర్, చిరంజీవి చౌదరిలకు చెరో వారం రోజులపాటు జైలు శిక్ష విధించింది.

ఈ కేసుకు సంబంధించి మంగళవారం జరిగిన విచారణకు స్వయంగా హాజరైన ఆయా ఉన్నతాధికారుల వ్యవహారశైలిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతర్ చేసినందుకుగాను ఇద్దరు అధికారులకు ఏపీ హైకోర్టు ఈ శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది.

Update:
అయితే ఇద్దరు ఐఏఎస్ అధికారులకు విధించిన జైలు శిక్షను ఆ తర్వాత కొద్ది గంటల్లోనే హైకోర్టు రీకాల్ చేసింది. ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఉత్తర్వులను బుధవారం సాయంత్రంలోగా అమలు చేస్తామని ప్రభుత్వం తరపున న్యాయవాది లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో జైలు శిక్షను రీకాల్ చేస్తూ, శిక్ష తీర్పును హెచ్చరికగా భావించాలని హైకోర్టు పేర్కొంది.

Comments are closed.

Exit mobile version