నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో సుప్రీంకోర్డుల కీలక ఆదేశాలిచ్చింది. ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు డాక్టర్లతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియో తీసి నివేదికను సీల్డ్ కవర్‌ ద్వారా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది ఈమేరకు గుంటూరు జైలు నుంచి హైదరాబాద్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజును తరలిస్తున్నారు. రాత్రి 10 గంటలకల్లా ఆయన సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రతిని దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version