సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ కూతురు పెళ్లి ఖర్చుల చెల్లింపుల వివాదంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణా ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కూతురు ఫైవ్ స్టార్ పెళ్లికి స్పాన్సర్లు ఎవరని ఆయన ప్రశ్నించారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశిస్తుందా? అని ప్రశ్నిస్తూ, ఇందులో గల క్విడ్ ప్రో కో ను వెల్లడించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ వివాదానికి సంబంధించి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలను దిగువన చూడవచ్చు.