ఆయన పర్యటనకు ఎవరూ వెళ్లవద్దని అధికార పార్టీ నాయకులు ‘ఆర్డర్’ పాస్ చేశారు. అయినప్పటికీ పార్టీ కేడర్ ఆయన వెంట భారీ ఎత్తున కదిలింది. ఒకటీ, రెండు కాదు… వందలాది కార్లు, బైకులతో టీఆర్ఎస్ శ్రేణులు భారీగా స్వాగతించాయి. శనివారం పినపాక నియోకవర్గంలో పర్యటిస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లభించిన భారీ స్వాగత దృశ్యానికి సంబంధించిన వీడియోను ఇక్కడ చూడవచ్చు.
విషయమేమిటంటే పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం, పినపాక మండలాల్లో పొంగులేటి శనివారం పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. పదిహేడు గ్రామాల్లో ప్రయివేట్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనకు టీఆర్ఎస్ నాయకులుగాని, కార్యకర్తలుగాని ఎవరూ హాజరు కావద్దని, పాల్గొన వద్దని పినపాక, కరగూడెం మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, రావుల సోమయ్యలు విలేకరుల సమావేశం పెట్టి మరీ ఆర్డర్ పాస్ చేశారు.
కానీ ఆ పార్టీ కేడర్ పొంగులేటి పినపాక నియోజకవర్గం పర్యటనను విజయవంతం చేస్తున్నాయి. ఆయన రాక సందర్భంగా భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరై పొంగులేటిని స్వాగతించడం విశేషం. అనంతారం నుంచి కరకగూడెం వెళ్లే మార్గంలో పొంగులేటికి లభించిన స్వాగత దృశ్యాన్ని దిగువన గల వీడియోలో చూసేయండి.