ఖమ్మం నగరంలోని ముత్యాలమ్మ గుడి సెంటర్ లోని జంక్షన్ లో నిర్మిస్తున్న ఓ మత విగ్రహంపై తెలంగాణా హైకోర్టు కీలక ఉత్తర్వు జారీ చేసింది. విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి అల్లిక అంజయ్య దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈమేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
వచ్చే మార్చి 14వ తేదీ వరకు ఎటువంటి విగ్రహం పనులను అక్కడ నిర్వహించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాల ప్రకారం ఈ ఉత్తర్వును ఇస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఖమ్మం జిల్లా కలెక్టర్ ను, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది.
హైకోర్టు జారీ చేసి ఉత్తర్వు ప్రతిని దిగువన చూడవచ్చు.