సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ మృతి చెందారు. గత నెల 26వ తేదీన ఏపీలోని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కాగా, తీవ్రంగా గాయపడిన మహేష్ ను మెరుగైన చికిత్స కోసం చెన్నయ్ లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి దాదాపు పదిహేను రోజులుగా చికిత్స పొందుతూనే మహేష్ శనివారం మరణించారు.

Comments are closed.

Exit mobile version