కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ధిక్కరిస్తున్నారా? లాక్ డౌన్ ఆదేశాలను ఉల్లంఘించి బజార్లలో బలాదూర్ గా తిరుగుతున్నవారి వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా? అయినా సరే మమ్మల్ని ఎవరూ చూడడం లేదని వీధుల్లో గుంపులుగా గుమిగూడుతున్నారా? కానీ మిమ్మల్ని పైనుంచి ఓ సాంకేతిక పరికరం గమనిస్తోందనే విషయం మీకు తెలుసా? మీ ప్రతి కదలికను రికార్డు చేసి పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తోంది.
ఔను.. డ్రోన్ కెమెరా మిమ్మల్ని, మీ అడుగు జాడలను పరిశీలిస్తోంది. మీ ప్రతి కదలికలను గమనిస్తోంది. లాక్ డౌన్ ఆదేశాల్లో మీ ప్రతి ఉల్లంఘన దృశ్యాన్ని రికార్డు చేస్తోంది. డ్రోన్ అందించే సమాచారం ఆధారంగా పోలీసులు మీపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఉల్లంఘనకు మూల్యం తప్పదు. కావాలంటే కరీం‘నగరం’లో పోలీసులు ఉపయోగిస్తున్న డ్రోన్ కెమెరా ప్రజల కదలికలను ఎలా చిత్రీకరిస్తున్నదో చూడండి. ఇది తెలంగాణాలోని దాదాపు అన్ని నగరాల్లో, ముఖ్య పట్టణాల్లోనూ అమలవుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో మిమ్మల్ని ఎవరూ చూడడం లేదని ఉల్లంఘనకు పాల్పడకండి. ఎందుకంటే డ్రోన్ మిమ్మల్ని చూస్తోంది మరి. కావాలంటే దిగువన వీడియోను తిలకించండి.