ఈనెల 11న జరిగే గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాంచందర్ రావు ప్రకటించారు. ఈ విషయంలో ఫలితం ఎలా ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థులు మాత్రం మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల బరిలో ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన బీజేపీ తెలంగాణ ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆయన ఇంకా ఏమంటున్నారో దిగువన గల వీడియోలో చూసేయండి.