ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ వేటు పడిన ఐపీఎస్ అధికారుల్లో పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ ఉన్నారు. ముంబయి నటి వ్యవహారం, ఇతరత్రా ఆరోపణలపై ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.
ముంబయి నటి కాదంబరి జత్వానీ అరెస్టు అంశంలో కీలక పాత్ర పోషించినట్లు ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఆరోపణలు ఎదుర్కున్నారు. మొత్తం ఉదంతంపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. దీంతో విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు విచారణ నివేదికను సమర్పించారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతారాణా టాటా, ఐపీఎస్ విశాల్ గున్నీలపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.