పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతలు మల్లు రవి, మధు యాస్కీ గౌడ్ తదితరులతో కలిసి రేవంత్ ఆదివారం తుక్కుగూడలోని దేవేందర్ గౌడ్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
దేవేందర్ గౌడ్ తోపాటు ఆయన కుమారులు వీరేందర్ గౌడ్, విజయేందర్ గౌడ్ లను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకే రేవంత్ వెళ్లారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మర్యాదపూర్వక భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఉందా? లేదా? అనే అంశాలపై స్పష్టత రావలసి ఉంది.