ప్రయివేట్ విద్యా సంస్థల టీచర్లకు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2 వేల ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. విద్యాశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల్లో
పనిచేస్తున్న దాదాపు 1. 45 లక్షల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు.