విద్యాసంస్థల నిర్వహణపై తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ రేపటినుండి (24.3.2021) తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి, రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్ లైన్ శిక్షణా తరగతులు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.