లగ్గం పిలుపు…ఐతారం, అంబటాల్లకు… సిన్న పిల్లగాడు, తొలుసూరి బిడ్డ, దీవెనార్తి ఇచ్చి కడుపునిండ తినిపోతే మా దిల్ ఖుషైతది. పిలిశెటోళ్లు, అర్సుకునెటోల్లు, లగ్గం యాడనో ఎర్కన? మా చిన్నబాపు లగ్గంకు ఖచ్చితంగా రావలె.. సుట్టాలు, సోపతుల ఖుషీ మధ్య… తలువాలు ఏసినంక బువ్వ… అంటూ అచ్చ తెలంగాణా యాసలో ముద్రించిన శుభలేఖను మీరు ఎక్కడైనా చూశారా? బహుషా చూసి ఉండకపోవచ్చు. కానీ ఈ పెళ్లి పత్రికను ఆసాంతం చదివితే మనకూ కాస్త తెలంగాణా యాస అబ్బినట్టే అనిపిస్తుంది.
‘మై విలేజ్ షో’ అర్టిస్టు చంద్రమౌళి అలియాస్ చందు తెలుసుగా? అతని వివాహం సందర్భంగా అచ్చు వేయించిన వెరయిటీ శుభలేఖ ఇది. నెటజన్ల ప్రశంసలను భారీగా అందుకుంటున్న ఈ పెండ్లి పత్రికలోని బాస, యాసలోని అన్ని సంగతులు ఇక్కడే రాసేస్తే మజా ఏముటుంది! దిగువన గల ఆ వెరయిటీ పెండ్లి పత్రికను మీరూ పూర్తిగా చదివేయండి.